ధ్రువ తారలై వెలుగుతాం!!

నీలో నేను...
నీతో నేను....
నీ చుట్టూ నేను....
నీవే నేను...............

నీలో నువ్వు....
నీతో నువ్వు.........
నీ చుట్టూ నువ్వు........
????????????????????
నువ్వు మారి పోయావ్!!

ఎంత కాలం....?
ఈ బంధం ఎక్కడి కి దారి తీస్తున్దో కదా

ఎక్కడికీ దారి తీయదు.....
మనం చేరవలసిన తీరానికే చేరుతాము

ఆకలితో అలమటించమ్
ఆశల సుడి గుండం లో కొట్టుకు పోమ్

కుల తత్వపు కుల్లును కడిగే అమృతమై తిరిగొస్తామ్
మతాంతరాలు చూపే మానవుల హృదయాల్లో మానవత్వమై వెలిగొస్తామ్
ఆచారాల చాటున, సంప్రదాయాల మాటున
నలిగి పోయి, ఎండి పోయిన జీవితాల్లో
తొలకరి జల్లై కురుస్తామ్

బంధనాలను తెంచుకుని
మన బంధాన్ని ధ్రుఢమ్ చేసుకుంటాం!
ధ్రువ తారలై వెలుగుతాం!!
చీర కీర్తిని పొందుతాం!!!