నిన్న..

నిన్న సాయంత్రం నువ్వు కడిగేసిన ఆ హృదయాంతరాలాల్లో దాగున్న సూనృతం అగుపించిందా?
ఆ భీరుత్వపు అవస్థల్లోని రుజుత్వాన్ని గుర్తించగలిగావా?

ఉన్నతమైన ఆశయాలు, ఉదాత్తమైన భావాలంటే అంత చులకనా?
ఎంతటి నీచత్వం, మరెంతటి భావదారిద్ర్యం

బరువైన నీ గుండె దిటువును ఎంత తేలికగా దించేసుకున్నావు?

నేను, నా - ఇంతటి సంకుచితమా, విశాలమైన ఆ మృధు మధుర మంజుల మనోజ్ణ వదనపు నడవడిక

ఇదే సంస్కృతి, ఇదే సాంప్రదాయం అయితే - చెమ్మగిల్లిన, మీ చెక్కిల్లపై జారిపడ్డ ఆ కన్నీటి బిందువుల సాక్షిగా
మీ హృదయపు చివరి అంచుల దాకా స్థిరమైన మీ అభిప్రాయం సాక్షిగా

అనంతమైన ప్రేమ, పిచ్చి ప్రేమ, అవధులు లేని ప్రేమ - ఇదే కదా మీకర్థమయ్యేది
ప్రేమ, లాలన, విరహం, సూనృతం, అంకితం - బహుశా ఇవన్నీ అర్థాలు వెతుక్కోవాలేమో

జీవించడమే మీక్కావాల్సింది అయితే - నేను నేను గా జీవించడమే నాక్కావాల్సింది