గోదావరి..
నా కలల రాకుమారి..
గవ్వల గలగలలు;
హొయలొలికే ఒంపు సొంపులు!
వయ్యారమైన మలుపులు;
సయ్యాటకు సేదనిచ్చే తీరాలు !!
ఎద నిండా తరగని స్మృతులకు పుట్టినిల్లు;
మరపు రాని చరిత్ర కు ఆనవాలు !!!
నా గోదావరి.. నా పాలిట మురళీ ఝరి...
ఉప్పొంగే ప్రవాహం నాలో ఉత్తేజాన్నిస్తే;
ప్రశాంత పయణం నాలో శాంతి కి బీజం వేస్తుంది !
ఎగసి పడే అలలు నా కోరికలకు ఉదాహరణైతే;
మిడిసి పడని విరులు నా అహంకారాన్ని పారద్రోలుతుంది !!
నా గోదావరి! ప్రవహించు నాలో ఒక్కసారి!!
నా గోదావరి! పులకించు నిను చేరి!!
నా గోదావరి! తీసుకెళ్లు నను నీ దారి!!