సమాజంలో,
దానికి అర్థం వెతికే పనిలో ;
సుదూర తీరాల ఆవల స్వేచ్ఛని దుర్భిణి తో వెతుకుతూ
ఆనందాన్ని అనుభవిస్తున్నానని భ్రమపడుతూ
గాజుతెరల మాటున, గాలి వీచని చోటున
మనసుని, మనిషినీ గౌరవించని మరల మధ్యన
మళ్లీ పుట్టని ఆ ప్రేమ క్షణానికై, దరి చేరని మధురానుభూతికై
తిరిగి రాని గత స్మృతుల ఆలోచనల ప్రవాహంలో తేలుతూ
రేపు రాని నిన్నటికై, నిన్న కాని నేటి కై..
అన్నిటికీ దూరమై ...కొన్నిటికి భారమై
ఉషోదయంలో ప్రవేశించే ప్రయత్నాల్లో..
నన్ను నేను, నిన్ను నేను నమ్మించే యత్నాల్లో
గళంలో, గమనంలో, గగనంలో నిన్నే అనుసరించాలన్న
ఆశయాలన్నీ, జ్ణాపకాలన్నీ, అక్షరాలన్నీ
ప్రళయాలనీ, ప్రణయాలనీ ఒకే దరిన చూస్తూ
మరపు రాని, మరువ రాని నీ విలాసాన్నీ
ఉన్నతమైన, విశాలమైన, అనంతమైన నీ ప్రేమని
రహస్యంగా, మృగ్యంగా, చీకట్లో, కుత్సితంగా
నన్ను మరువని..నీ చివరి క్షణానికై
నీ చితిలో మండుతున్న నా వేదన ని,
నా అజ్ణానాన్నీ, నా మూర్ఖత్వాన్నీ,
నా అల్పానందాన్నీ, నా అప నమ్మాకాన్నీ
నా భీరుత్వాన్నీ, నా రుజుత్వాన్నీ,
నా హృదయాన్నీ, అందులోని మళినాన్నీ..
చూడనీ....చూసేవరకు ఉండనీ..
తెలియని తనాన్నీ, తెలిసిన మనసునీ
తెలివిడిగా తప్పించుకున్నందుకు,
విదారకంగా వదిలించుకున్నందుకు
జన్మాలూ, బంధాలూ..శతాలూ, సహస్రాలు..
క్షణాలూ, యుగాలు..అనంతాలు, అవ్యయాలు
బాధలూ..శాంతులూ..విడ్డూరాలూ, స్థిమితాలు
నువ్వు, నేను, నా స్వప్నం, నీ నవ్వు, నీ ఎదురు చూపు...
శాశ్వతం! శాశ్వతం!! శాశ్వతం!!!