శ్రీరఘునందన..సీతా రమణా !
శ్రితజనపోషక రామా !
కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా !
ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా !
నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా !
వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా !
భాసుర వర సద్గుణములు కల్గిన భధ్రాద్రీశ్వర రామా !
ఏ తీరుగ నను దయజూజెచదవో ఇనవంశోత్తమ రామా !
జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..
జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..
జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..
జయ జయ రాం .. జయ జయ రాం .. జయ జయ రాం ..