సత్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శౄతిశిఖరీ.. నిగమఝరీ.. స్వరలహరీ !
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
వెతలు తీర్చు మా దేవేరీ.. వేదమంటి మా గోదారీ
శబరి కలిసినా గోదారీ.. రామ చరితకే పూదారీ
ఏసెయ్... చాప జోర్సెయ్.. నావ వార్సేయ్.. వాలుగా..
చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
సావాసాలు.. సంసారాలు.. చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయాంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలై పోతున్న ఇంటిపనుల దౄశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి లగ్గం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడా
నది ఊరేగింపులో.. పడవ మీద రాగా.. ప్రభువు తాను కాగా
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపూ
లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకూ
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికీ
లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపూ
అర పాపికొండలా నలుపు కడగలేకా.. నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలో వరీ
భూదారిలో నీలాంబరీ.. మాసీమకే చీనాంబరీ
వెతలు తీర్చు మా దేవేరీ.. వేదమంటి మా గోదారీ
శబరి కలిసినా గోదారీ.. రామ చరితకే పూదారీ
ఏసెయ్... చాప జోర్సెయ్.. నావ వార్సేయ్.. వాలుగా..
చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా