ఎం లాభం?

ఎంత కవిత్వం చెప్పినా ఏం లాభం?
ఏ ఒక్క కవితకూ నీవు స్పందించ నపుడు,
ఎన్ని కథలు వ్రాసిన ఏం లాభం?
ఏ ఒక్క కథా నీ మనసును స్పృశించలేనపుడు,
ఎన్ని చదువులు చదివినా ఏం లాభం?
ఏ చదువూ నీ మనసును చదివే జ్ఞానాన్ని నేర్పనపుడు,
ఎన్ని గంటల సమయమున్నా ఏం లాభం?
నీ వొళ్లో సేద తీరుతూ నన్ను నేను మార్చి పోయే ఒక్క క్షణం లేనపుడు,
పరులకు ఎంత సేవ చేసినా ఏం లాభం?
నీ సేవ చేసుకునే భాగ్యం లేనపుడు,
ఇంత బతుకు బ్రతికి ఏం లాభం?
నీ సహచర్యం లేనపుడు.
............................................
.............................................
నీవె శరణం, లేకుంటే మరణం
నీ కోసమే ఎదురు చూస్తూ............. పరి తపిస్తూ................