ఒక మిట్ట మద్యాహ్నం వేళ ......

అలసట తో కూడిన శరీరాన్ని
తనపై పడుకుని సేద తీర్చుకోమంటూ
అక్కున చేర్చుకునే ఆ "బెడ్ కాటే"
జరగా బోయే ఉత్పాతానికి సజీవ సాక్ష్యంగా కొయ్య బారిన వేళ ......


నిలబడుతూ పరిగెత్తే యాంత్రిక జీవితం లో
కొంచెం సమయమైన కూర్చోమంటూ
ఆహ్వానించే ఆ "కుర్చీ"యే నీలువెత్తు నిదర్శనం లా నిలబడిన వేళ ......


దేహానికి రక్షణగా మాత్రమే కాక,
దేహం వీడడానికీ తన వంతు సహకారాన్ని "చున్ని" ఇచ్చిన వేళ ......


ప్రశాంతమైన గాలిని ఇవ్వడమే కాకుండా
ప్రశాంతమైన వాతావరణానికి పరుగులు పెట్టమంటూ
ఎప్పుడు గిర గిరా తిరిగే ఆ "ఫ్యాన్" స్తబ్ధంగా ఆగిన వేళ ......

ఇంకేముంది ?

ఒక నిండు ప్రాణం నింగికెగసింది.

తల్లి తండ్రుల మూగ బాసలు,
బంధువుల ఆర్తనాదాలు;
స్నేహితుల గత స్మృతులు,
విధి వెక్కిరింతలు.

(ఒక మోడల్ విద్యార్థిని ఆత్మ హత్యకు సంతాప సూచకంగా ....)