నమ్మాలనే ఉంది
పైన ఆకాశాన్ని, కింద నేలని
కురిసే వర్షాన్ని, పారే ఏరును
మిత్ర వాక్యాన్ని, చెలియ ఆలింగనాన్ని
నమ్మాలనే ఉంది
కవి ప్రగల్భాన్ని, బోధకుడి ప్రవచనాన్ని
నారాయణుడి దారిద్ర్యాన్ని, కోటయ్య భూ పాతరలను
కళాకారుడి అభినయాన్ని, పేదయ్య జీవితాన్ని
నమ్మాలనే ఉంది.