తూర్పునే అస్తమిస్తాను!!

నీవు మౌనంగా ఉంటే
ఇదే చివరి చూపు
నీవు నోరు విప్పితే అదొక ఆశ
నీవు అవునంటే అదొక
నెరవేరిన కోరిక
నీవు కాదంటే ఇక;

నిను మరువలేక
నిన్ను నన్ను గా చూడలేక
నువ్వు నేను కాదన్న సత్యాన్ని కాదనక

తిరిగి తిరిగి

అలసి సొలసి

...........................................
...........................................
తూర్పునే అస్తమిస్తాను!!!