ఆధునిక భావాలతో నువ్వు;
ఆదర్శ భావాలతో నేను
ఏ రాయి అయినా ఒకటే అని నువ్వంటే;
ప'రాయి' అయితే కష్టమని నేను
ఏ దరికి చేరాలో, ఏ గమ్యం ముందుందో
నీ వాళ్ల కోసం నువ్వు, నా వాళ్లు కాని వారి కోసం నేను
బ్రతుకంటే, బ్రతికెయ్యడమే కాదు, బ్రతికించడమే
...........................................స్వేచ్ఛా వాయువులు ప్రసరించే ప్రతి హృదయంలోనూ నేను జీవించే ఉంటాను!