నా కోసం దేవుణ్ణి ప్రార్థించావు
నేనెప్పుడూ నీ గురించి ప్రార్థించలేదు
నవ మాసాలు మోసావు
నీకు భార మవడమే తప్ప నీ భారానెప్పుడు నే మోయలేదు
ప్రసవ వేదనతో తల్లడిల్లినా
జాగ్రత్తగా నన్ను భూమి మీదకు దించావు
తప్పటడుగులు వేస్తున్నానని మురిశావే
కానీ పెద్దయ్యాక తప్పుటడుగులు వేస్తానని ఉహించ లేదు
గోరు ముద్దలు తినిపించావు
గారాబంగా పెంచావు
ఇరవయ్యేళ్లొచ్చినా కంటికి పాపలా చూసుకున్నావు.
నీ రెండు కళ్ళను, కలలను కుళ్ల బోడిచేసి ఇంటిని విడిచిపెట్టానే,
కానీ, అమ్మ హృదయాన్ని అందుకోలేక పోయాను !
అమ్మా నన్ను క్షమించమ్మా !!