చిన్న మసీదు సందులో తిరిగిన జ్ఞాపకాలను
ఎంత పెద్దగా మనసులో దాచుకున్నానో!
ద్రోహి అని నువ్వు అంటుంటే నీ చేత మళ్లీ మళ్లీ
అనిపించుకోవాలని ఎంతగా తపించే వాణ్నొ!!
గోదావరి మీద లేచే ఎండాకాలపు తుఫాను వలే
విజృంభించి నిన్ను కావలించుకోవాలని నేను చేసిన ప్రయత్న మెటువంటిదని?
తామర పూవు మీద మంచు బిందు వల్లే నా చే జారి పోబోతున్న నిన్నూ,
నీతో పెనవేసుకున్న బంధనాలను తెంచుకునే శక్తి నాకెక్కడిది?
"ప్రేమ సౌధా కరిలే" అని చలం గారి అరుణలా నీవంటూంటే...
మైదానం లో ఒంటెద్డులా........., తెగిన గాలి పటం లా.............
రంగు వెలసిన అరణ్యం లా............. వెన్నెల లేని చీకట్లో ఒంటరిగా.............
ఇలా ఎన్నాళ్ళు? ......... ఎన్నేళ్లు??..............
మాటల తో మై మరపించి, ఉత్సాహంతో పాటు ఊపిరి నిచ్చి,
స్వేచ్ఛగా నీవు కురిపించిన వరాల వర్షం లో తడిపి ముద్దను చేసి,
ఏమయ్యాయి ఆ ఆదర్శ భావాలు?
నాకు నేర్పిన జీవిత పాఠాలు??
మత మౌఢ్యుల మీద ఎక్కు పెట్టిన బాణాలు???