కాలి మువ్వై, వెలుగు దివ్వై, చిలిపి నవ్వై, చెలివి నువ్వై
తరుణి..నీ ఒడిలో వాలనీ, నీకై మళ్లీ పుట్టనీ;
నీ అరమోడ్పు కనుల చాటు కన్నీటి బిందువు కానీయ్
నీ లేత పాదాల కింద మట్టి రేణువు కానీయ్;
మొత్తంగా..నన్ను నీకు అర్పించనీయ్
ఈ జన్మలో కాకపోయినా, వచ్చే జన్మలో అయినా!