'... హెల్లొ ఎవరండి '
" నేనొక అసమర్ధున్ని "
'అసమర్ధులతో మాట్లాడే తీరిక ఇక్కడ ఎవరికి లేదు'
"కానీ, హక్కుంది, అవసరం అంతకంటే ఎక్కువనే ఉంది."
'బాబూ, ఇక్కడ అవసరాల రాంబాబు ఎవరు లేరు, ఫోను పెట్టేయ్.'
"నిజంగానే నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా నీకు?"
'అంటే ......., అబద్దం గా ఉంటుందా?'
"ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా?"
'మీరు అంతే కదా ? గతాన్ని మార్చిపోయారేమో?'
"అవును, గతాన్ని మర్చిపోదామనే ఈ ప్రయత్నం."
'ఇది ఎన్నో ప్రయత్నమో?'
" ............ ఇదే చివరిది కావాలని అనుకుంటున్నాను."
'అబ్బో...., ధృడ నిశ్చయం లాగుందే?'
"అవును, అందుకే ఈ దైర్యం."
'అబ్బాయిగారికి దైర్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట?'
"అలా అని కాదు "
'అలా అనే? కదా .......
అప్పుడు ఇంత దైర్యం, ఎక్కడ పోయిందో?'
"అప్పుడు లేదని కాదు , కానీ...... "
'కానీ....'
"అప్పుడు ఆ సాహసం చేయలేకపోయాను, తప్పే..... "
'ఇప్పుడు కూడా ఈ సాహసం చేసి తప్పే అంటారేమో తర్వాత!'
"ప్లీజ్, అర్దం చేసుకో,"
'అదే నేను కూడా అంది , ఆ రోజున
మీకు ఇంకా గుర్తు లేదోమో, కానీ నాకు బాగా గుర్తే'
"పరిస్తితుల ప్రభావం, అలా చేయాల్సి వచ్చింది."
'ఇప్పుడు కూడా ఆ పరిస్తితుల ప్రభావమే, నేను ఇలా మాట్లడాల్సి వస్తోంది,
దయచేసి ఇంకెప్పుడూ ఫోను చేయకండి.'
"నన్ను మర్చిపోదల్చుకున్నావా ?
నన్ను విడిచి పెట్టి ఎలా ఉండగలుగుతున్నావ్?"
'అసమర్ధులతో కాదు కదా నేను ఉండేది, అందుకే బాగానే ఉండగలుగుతున్నాను.'
"అంటే నీ ఉద్దేశ్యం?"
'నా ఉద్దేశ్యమేమీ కాదు '
"అంటే "
'వేరే ఎవరి ఉద్దేశ్యం కాకూడదని......
..............................'
"అసంపూర్తిగా ఉంది...."
'నీవు నేర్పినదేగా ?'
"మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎందుకలా మాట్లాడుతున్నావు?"
'మరొకరిని బాధ పెట్టడం ఇష్టం లేక'
"కానీ నేను ఇక్కడ బాధ పడుతున్నాగా?"
'పడాలిగా?'
"అంటే అర్దం కాలే ... '
'అర్ఢమవడానికి ఏముంది ఇందులో, '
""బాధ పెట్టడం గొప్ప కాదు ;
బాధ పడడం ప్రాయశ్చిత్తం కాదు,
బాధలే లేని జీవితం సఫలం కాదు;
బాధల తోనే జీవితం ఎండ్ కాదు... ""
"ఎక్కడో విన్నట్లుందే"
'విన్నట్లుగానే ఉందా...?'
".............."
'మీరు వ్రాసిందే..'
"ఓ, అవును కదూ,"
'.............'
"ఇందుకోసమేరా, నీవెప్పుడూ నాతో ఉండాలి"
'ఇందు కోసమేనా?'
"అలా కాదురా.."
"నా మనసు నీకు కాక మరెవరికి తెలుసు చెప్పు?"
'ఎవరికి అర్దమయ్యావు గనక?'
"ఎంతైనా నేను గొప్పవాన్ని కదా ?...."
'అరె, అప్పుడే అసమర్ధుడి పోస్టు నుండి గొప్పవాడి పోస్టు కు ప్రమోట్ అయ్యారా?'
"నీ తోడు ఉంటే అంతే మరి ."
'...........'
"అవును, నిన్ను చూడక చాలా రోజులైంది, ఎలా ఉన్నావు?"
'ఎప్పుడైనా అద్దం వంక చూసుకున్నారా?'
"అరె , షేవింగ్ గురించా నువ్వడిగేది ?"
'"నీ మొహం" , ఏది రెండు సార్లు చెబితే కానీ అర్దం కాదు !.'
"నా మొహమా?"
'అవును'
"రోజు కు వంద సార్లైన చూసుకుంటూ ఉంటానుగా?"
'మరి నేనెలా ఉన్నానని అడుగుతున్నారు?,
అద్దం లో మీ మొఖమేలా ఉందో నేను అలాగే ఉన్నాను.'
"సారీ రా...."
'ఎన్ని రోజులైంది తినక ? '
"అంటే తింటున్నాను కానీ, ... "
'చెప్పొద్దు, మీ మాటల్లోనే తెలుస్తుంది, '
"నిదుర లేని రాత్రు లెన్నో ఎలా వివరించను?"
"నీవు లేని నేను
తడి లేని నందనవనం లా..
రంగు వెలసిన అడవి లా...
ఎలా బ్రతక గలుగుతున్నానో నాకే తెలియదు
నీ వొడిలో మేను వాల్చిన క్షణాలనే తల్చుకుంటూ
నీ వెచ్చని పరిష్వoగంలో సేద తీరిన మధురానుబూతిని నెమరు వేసుకుంటూ... "