మీ కళ్ల ముందు కనపడేది
నిజం కాదని మీ మనసు పదే పదే చెబుతుంది
కానీ, మీరు దాన్నే నిజమని అంటారు
మీరు మీ కోసం చూడరు!
మీరు వింటున్నది, అంత కన్నా ఛండాల మైనది
ఈ ప్రపంచం లో మరొకటుండదని మీకు అవగత మవుతూనే ఉంటుంది
అయినా మీరు దాన్నే మహా గొప్పగా అభివర్ణిస్తారు
మీరు మీ కోసం ఆలోచించరు!!
మీరు మాట్లాడేదో మీకే తెలియదు
కానీ దాన్ని అందరు చెవులు రిక్కించి మరి వినాలంటారు
మీరు మీ కోసం మాట్లడరు!!!
స్వశక్తి నే నమ్ము కోవాలంటారు
శ్రమైక జీవనమంటూ ప్రగల్భాలు పలుకుతారు
కానీ... గుండెలవిసేలా బండ రాళ్ళ చుట్టూ తిరుగుతారు
మిమ్మల్ని మీరే నమ్మరు!!!!
కానీ....
మేము మాత్రం మిమ్మల్ని నమ్మాలి,
మీ స్వార్దలకై మార్పు చేసుకోదగ్గ మీ నీచ సంప్రదాయల్ని నమ్మాలి
మీ ఇంటి ఆడ పడుచులు ప్రతివతలంటే నమ్మాలి