నాడు,
తండ్రి కష్టించి సంపాదించిన
సొంత భూమి కోసం
ఆక్రమణదారులను బ్రతిమిలాడి
న్యాయం కోసం స్టేషన్ చుట్టూ
కాళ్లరిగేలా తిరిగి తిరిగి
విసిగి వేసారి సాయుధుడై
బెదిరించ బోయిన
అన్నను చంపినపుడు;
అది ఘోర మైన చావు !(?)
నేడు,
సరిహద్దులో దేశం కోసం
ప్రాణాలను సైతం లెక్క చేయక
ఉగ్ర వాదులతో , మిలిటెంట్ల తో
వీరోచితంగా పోరాడి యుద్దములో
తమ్ముడు చనిపోయినపుడు;
ఇది వీర మరణమా?
ఏది గొప్ప చావు?
ఈ లోకం తీరు ఇంతేనా???