ఎందుకీ జీవితం?.................

నువ్వే నా లోకమని నేనంటూంటే
అజ్ఞానాన్ని వీడరా అని అమ్మ హిత బోధలు..........
ఆ జ్ఞానాన్ని పొందడం కోసమే కదా నా ఈ ఆరాటమంతా...

ఏం భావుకత నీ పలుకులొ;
ఏం అందం నీ నడకలో;
ఎంత ఆరాధ్య నీయం నీ రూపం;
ప్రియా.. నీవెంత అందగత్తెవో!
నీకేం తెలుసు-- నా మనసు??

చితికైనా నీతోనే,
బ్రతుకైనా నీతోనే

బ్రతుకు భ్రమర0 లా మకరందం కోసం వెతుకుతుంటే కదా-
ఎడారిలో ఒయాసిస్సు లా చేయూతనిచ్చి, చేయందించి,
ఇప్పుడేమో చెష్టలుడిగేలా చేశావు

ప్రియా.. నీవెంత నిజమో ... అంతే కల
ఏడుస్తున్న పిల్లవాణ్ని దించి, దూరంగా చెరువుకు వెళ్లే తల్లిళా!

ఓ! వరూధినీ ............... నీవెంత అబద్దం...
ఓ! వసుంధరా......నిన్నెలా మరువగలను? ఎలా నిద్దురోగలను?
నిద్ర లేని రాత్రుల్లోనూ..., పండు వెన్నెల్లో కూడా
పసి పిల్ల బోసి నవ్వు వలే గుర్తోస్తున్నావు..

ఎందుకీ ప్రేమ?....... ఎందుకీ బాధ?......... ఎందుకీ జీవితం?.................