ఓ ప్రేమా......... నీకు గెలుపెక్కడిది???

ముద్దులొలికే ఆమె మాటల మాటున
హద్దులు మీరే నా చేతల చాటున
ఒద్దికగా నలిగిపోతూ,
మత్తుగా నిదుర పోతూ,
మూగ మనసులకు రాగాలు నేర్పుతూ,
భోగ భాగ్యాలను దూరం చేస్తూ,
బ్రతుకులను చిత్తుగా మారుస్తున్న
ఓ ప్రేమా......... నీకు గెలుపెక్కడిది?
ప్రేమికులైనా గెలుస్తారు,
తల్లి తండ్రులైనా గెలుస్తారు,
కానీ నీకు గెలుపెక్కడిది???