ప్రేమకు తెలియదు సంస్కారం
అనే వారికి లేదు ఈ భూమిపై ఆస్కారం;
చేస్తారందరు తిరస్కారం, అయినా
సర్వ ప్రాణ కోటికి అదే ఆధారం.
ఆది కవి కలానికి , అన్నమయ్య గళానికి ,
ఆత్రేయ భావానికి ఆధార భూతము ఈ ప్రేమ
సృష్టికి ప్రతి సృష్టిని చేసే మనో మేథస్సుకు ప్రత్యేక దృష్టి తో
ఆ హరి యందించిన ప్రాణుల మధ్య అనుసంధాన ధూతము ఈ ప్రేమ
అంతస్తులు అడ్డురావు, అవస్తలు తెలియ రావు ఈ ప్రేమలో
వర్ణము సువర్ణమై, ఆకారము సహకరామౌతుంది ఈ ప్రేమలో
కులమునొదిలి గుణమునే చూస్తుంది,
మతము నొదిలి మానవత్వమునే ఎంచుతుంది ఈ ప్రేమ
మకరంద మాధురీ మంజుల మామక ప్రణయ మానస భావనలే
పుష్పాంజలులుగా అందించు/అందుకొను ప్రేమ యాత్రికులకు
మీ "కరుణ" అందించు చిరు కర దీపిక.