ఇదేనా స్వాతంత్ర్యం??

ఎక్కడుంది భయం?
ఎడారుల్లొనా?
ఎండమావుల్లోనా?
గుహల్లోనా?
గుండె లోతుల్లోనా?

ఎక్కడుంది భయం?

గుభాళించే పరిమళాన్ని మోసుకొచ్చే గాలికేం తెలుసు వాసన?
కొండ కోనల్లోంచి సుడులు తిరుగుతూ ప్రవహించే నీటికేం తెలుసు రుచి?

ఎగసి పడే అలల వెనక దాగున్న సత్యమేది?
మిడిసి పడే యవ్వనానికున్న సార్ధకత ఏది?

సెలయేటి గలగలలు,
సిరిమల్లె గుబగుబలు;
కోయిలమ్మ కుహుకుహులు,
మందారపు రెపరెపలు;
ఇదేనా స్వాతంత్ర్యం??