ఆచార్ల గారమ్మాయి!!

ఒక చేయి నెత్తి మీద .. గడ్డి మోపుపై...
మరొకటి నడుం మీద .. వయ్యారంగా......

ఆ చిత్ర లేఖనం తోనే తెలిసి పోతుంది;
ఆచార్ల గారమ్మాయి ఆశల హరి విల్లు.

సా పా సా అంటే ఆమెకెంతో ఇష్టం
ఆమె మధుర గాణమంటే నాకు మరెంతో ఇష్టం

ఒద్దికగా ఉండట మెలాగో తెలుసు
ఓర్పుగా నేర్పించడం కూడా తెలుసు

మనసు ఇష్ట పడ్డ వాని మాటలు నమ్మడం,
కష్టా లెదురైనా నీతో నే అంటూ ప్రమాణం చేయడం
శివ వైష్ణవ బేధ0 నాకు లేదంటూ శివాభిషేకం చేయడం
గవాక్షాలన్ని మూసుకొని ఇంట్లో కూర్చోకుండా
హృదయ గవాక్షాన్ని తెరిచి సంఘ సేవ చేయడం

పండితులతో సమానంగా వేదాలు వల్లించడం
భావి భారత పౌరులనందించే వృత్తికి అంకిత మవడం
తమ వారి మూర్ఖపు పనులను ఎత్తి చూపడం
మానవత్వంతో పరులను దరి చేర్చుకోవడం

అవును, తనకూ కొన్ని ఆచారాలున్నాయి......
ఎంతైనా.... తను ఆచార్ల గారమ్మాయి కదా.............!!!