సీతాలు సింగారం .. మా లచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం (2)

మనసున్న మందారం .. మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం (2)

సీతాలు సింగారం !

కూసంత నవ్విందంటె పున్నమి కావాలా..
ఐతే నవ్వనులే
కాసంత చూసిందంటె కడలే పొంగాలా..
ఇక చూడనులే

కూసంత నవ్విందంటె పున్నమి కావాలా.. కాసంత చూసిందంటె కడలే పొంగాలా..
ఎండి తెరమీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగూ బొదుగూ ఎలుగూ కన్నుల ఎన్నెల కాయాలా..

నువ్వంటుంటే..నే వింటుంటే..నూరేళ్ళు నిండాలా..

సీతాలు సింగారం .. మా లచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
మనసున్న మందారం !

దాగుడుమూతలు ఆడావంటె దగ్గరకే రాను
ఐతే నేనే వస్తాలే..
చక్కిలిగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
ఎగిరొస్తాలే..

దాగుడుమూతలు ఆడావంటె దగ్గరకే రానూ
చక్కిలిగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగీ వెలిగించాల..
నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా..

నువ్వంటుంటే..నే వింటుంటే..వెయ్యేళ్ళు బతకాలా..

సీతాలు సింగారం .. మా లచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం
లా లా ల లా ల లా.. లా లా ల లా ల లా..