అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
కలవో అలవో వలవో నా ఊహల హాసినీ
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని !

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ

తీపికన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే.. వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే.. నువు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ

నన్ను నేనే చాలా తిట్టుకుంటా..నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా..ఏదో చిన్నమాటే నాతో నువ్వు మాటాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే..ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ

ఈ పాటను వినాలంటే ఇక్కడ క్లిక్క్ చేయండి

<bgsound src=" Snehituda.m3u">