రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !

భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !
భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !

వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా !
వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా !

సతత రామ దాస పోషకా..శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా !
భద్రశైల రాజమందిరా..శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా !
బాహు మధ్య విలసితేంద్రియా..బాహు మధ్య విలసితేంద్రియా..

కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ !
కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ !

తల్లివి నీవే..తండ్రివి నీవే..దాతవు నీవే..దైవము నీవే !
కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ !

దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా !
దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా !
దశరధ రామా గోవిందా !

దశముఖ సం హార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా !
దశరధ రామా గోవిందా !

తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !
తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !

ఒక్క తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగతక్కువేమి మనకూ..
రాముండొక్కడుండు వరకూ !తక్కువేమి మనకూ..రాముండొక్కడుండు వరకూ !

జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా

పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభోపాహి రామప్రభో !
శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో !
సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సం యుతానంద రామప్రభో !
పాహి రామప్రభో !పాహి రామప్రభో !పాహి రామప్రభో !