కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !
కలలో నీ నామ స్మరణా ..మరువ చక్కని తండ్రీ !
పిలిచిన పలుకవేమి..పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా !
పలుకే బంగారమాయెనా..పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి..
కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !
పలుకే..
పలుకే బంగారమాయెనా..కోదండపాణి..
పలుకే బంగారమాయెనా..
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రీ !
పలుకే బంగారమాయెనా..పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయెనా..
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భధ్రాచల వర రామ దాసపోషా !
పలుకే బంగారమాయెనా..పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయెనా..కోదండపాణి.. పలుకే బంగారమాయెనా..
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి..
కలలో నీ నామ స్మరణ ..మరువ చక్కని తండ్రీ !
పలుకే బంగారమాయెనా.. పలుకే బంగారమాయెనా..