ఏంటీ! నీ తనువు నన్ను విడిచిపెట్టినా భౌతికంగా
నీ మనసు మానసికంగా నను విడువలేనంటుందా?
పదే పదే, అదే పనిగా నన్నే తలుచుకుంటున్నావు
రహస్యంగా, చీకట్లో, నా గురించే ఆలోచిస్తున్నావు
మృగ్యంగా అనిపించినా, సత్యం ఏమిటో బోదపడుతున్నదా
నిర్దయగా వదిలేసినా, ప్రేమంటే ఏంటో అవగతమవుతున్నదా
మనుషుల మనసులు చదవాల్సింది మెకానిక్స్ తో కాదు
ప్రేమ, నమ్మకం, ఓపిక తో అని అర్థమవుతున్నదా
నువ్వొదిలి ఎన్ని రోజులైనా, నువ్వెన్ని మైళ్ల దూరం లో ఉన్నా
నువ్విచ్చిన ఉత్సాహం, నువ్వందించిన ప్రోత్సాహం
నువ్వు పంచిన ప్రేమ, నీ నవ్వు
ఈ జన్మాంతం వరకూ నాతో ఉంటాయి
వసంతం చిగురిస్తుందనే ఆశతో, నీ రాక కొరకై, కడదాకా...కడలిని వదిలే దాకా..