నీలగగనా..ఘనవిచలనా..ధరనీజా శ్రీరమణా
హా.. ఆ.. మధురవదనా..నళిననయనా..మనవి వినరా రామా !

రామచక్కని సీతకీ అరచేత గోరింటా
ఇంత చక్కని చుక్కకీ ఇంక ఎవరూ మొగుడంట
రామచక్కని సీతకీ..

పుడతవీ పునవేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమచేతను శివుని విల్లును ఎత్తినా రాముడే
ఎత్తగలడా సీత జడనూ తాళి కట్టే వేళలో

రామచక్కని సీతకీ..

ఎర్ర జాబిలి చేయి గిల్లీ రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే..చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడూ

రామచక్కని సీతకీ..

చుక్కనడిగా దిక్కునడిగా..చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోనా..నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెలిపె..మనసు మాటలు కాదుగా

రామచక్కని సీతకీ అరచేత గోరింటా
ఇంత చక్కని చుక్కకీ ఇంక ఎవరూ మొగుడంట
రామచక్కని సీతకీ..

ఇందువదనా.. కుందరదనా .. మందగమనా..భామా
ఎందువలనా.. ఇందువదనా.. ఇంత మధనా..ప్రేమా ?