నేనూ...నా సమాజమూ

నేనూ, నా పద్దతులూ, నా నియమాలూ, నా సమాజమూ, నా భావాలూ, నా ఆశయాలూ...అసలు మొత్తంగా నేను...ఇలా పుట్టి ఉండాల్సింది కాదు, ఇలా పెరిగి ఉండాల్సింది కాదు, ఇలా జీవించి ఉండాల్సింది కాదు..జీవితంలో ఇంతవరకూ ఇలా ఎప్పుడూ అనిపించలేదు, ఇలా అనిపించిన మరుక్షణం నించీ అసలు జీవించాలనిపించడం లేదు. అయినా, ఉన్నతులూ, ద్విజులూ పెరిగిన సమాజం లోనే నేను పుట్టి పెరిగాను, కానీ నేనెందుకో హంస క్షీర న్యాయాన్ని కొంచెం ఎక్కువగా పాటించి తేడా (డిఫరెంట్) గా పుట్టాను/పెరిగాను. ఈ సమాజం మొత్తానికి తేడా గా అనిపిస్తున్నా, అరిచి గగ్గోలు పెడుతున్నా, నాకెందుకో ఇంతవరకూ ఆ తేడా ఏంటో అవగతమవట్లేదు. విశ్లేషించుకుంటే, నేనేదో సమాజాన్ని ఉద్ధరిద్దామన్న పేరాశల్లోనో, సమాజాన్ని సంప్రోక్షణ చేద్దామన్న భ్రమల్లోనో బ్రతకడం లేదు. ఉన్నంతలో ఉన్నతుల్ని తీర్చిదిద్దుదామని, అయినంతలో అవకాశాలను సృష్టిద్దామని అనుకుంటున్నానంతే. నాలో నేనుగా, నాకై నేనుగా, నా కోసం నేనుగా ఉన్నంత కాలం నాకే ఇబ్బందీ ఉండదనుకుంటా, వచ్చిన చిక్కల్లా,మార్పు అభిలషణీయమన్న మాటలను పక్కనబెట్టి మార్పునే అనుసరణీయమనుకుని చేతలకు ఉపక్రమించినప్పుడే...