సమయం ఆసన్నమైంది..


సమయం సరిగ్గా ఎంతైందో తెలీదు. ఒకవేళ నేను గడియారం చూసి చెప్పినా అది తప్పే అవుతుంది, ఎందుకంటే నేనున్నది ఒక దగ్గర, నువ్వున్నది ఒక దగ్గర... 

అన్నట్టు గడియారం అనగానే గుర్తొచ్చింది...ఎప్పుడు చూసినా చిన్న ముళ్ళుని చూసి పెద్ద ముళ్ళు, పెద్ద ముళ్ళు ని చూసి మరో ముళ్ళు తిరుగుతూనే ఉంటాయి, పోటీ పడి మరీ...ఎలాగైనా ఒకదాన్ని మరోటి దాటేద్దామని, పోటీలో గెలిచేద్దామని..

కానీ వాటికి తెలీదు, అవి ఎంత పోటీ పడ్డా అవి ఏనాటికీ ఒకదాన్ని మరోటి దాటలేవని, అలా దాటినా అది తాత్కాలికమే అని..అవన్నీ ఒక ఛట్రంలో బంధించ బడి ఉన్నాయని...గెలుపు, ఓటమి అనే దానికి అర్ధమే లేదని..

ఏంటో ఇదే లైఫ్ అంటే.. 

మనం కూడా అలాగే..పరిగెత్తుతూనే ఉంటాము..ఆ దరి నుండి ఈ దరికి, ఈ దరి నుండి ఆ దరికి...స్పిన్నింగ్... 

జీవితమంటే సంపాదించడం..అది పేరు కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు లేదా శత్రుత్వం కావచ్చు...అంతే 

జీవితంలో, ఈ భూమ్మీద ఒక్కొక్కరి మీనింగ్ ఒక్కోలా ఉంటుంది..ప్రేమ అంటె, ఎంజాయ్మెంట్ అంటే, మంచి అంటే.. నాకూ ఓ మీనింగ్ ఉంది ప్రేమకి, బాధకి..కానీ నా మీనింగ్ తెలీదు కదా, నా ఫిలింగ్ అర్ధం కావడానికి.. 

పిల్లవాడు ఏడుస్తున్నాడంటే మనకెలా వాడి బాధ అర్ధం కాదో, వాడి ఏడుపుకి రీజన్ తెలీదో, అలాగే ఉంటుంది...మనం ఎదుటి వాడి బాధ ని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు..ఒక్కోసారి, పిచ్చి అనిపిస్తుంది, ఈ మాత్రం తెలీదా అనిపిస్తుంది..ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా అనిపిస్తుంది..కాని మనం చేసిన ఎన్నో పిచ్చి పనులకీ? 

అదే ఎక్స్పీరియన్స్ అంటే..దాన్ని అనుభవించాలే గానీ, అభివర్ణించలేము నా దృష్టిలో, మానసిక ఆళింగనం కూడా పాపమై ఉండొచ్చు..నీ దృష్టిలో శారీరక కలయిక కూడా పెద్ద పాపం కాకపోవచ్చు..ఇంట్లో కూచుని TV చూడటమే నా ఎంజాయ్మెంట్ కావొచ్చు, బయటికెళ్లి సరదాగా తిరిగి బయటే తిని ఏ అర్దరాత్రో ఇంటికి తిరిగి రావడం నీ అనుభుతి కావొచ్చు.. ఎవరినీ తప్పనలేము, ఎవరిదీ రైటూ అనలేము...ముందే అనుకున్నాం కదా...ఎవరి మీనింగ్ వారిది.. 

జీవితం చాలా చాలా విచిత్రమైనదేం కాదు..మనం జీవించాలనుకున్నట్టుగానే, మనం చిత్రించాలనుకున్నట్టుగానే మన జీవితం ఉంటది..ఏ రంగులు వాడాలి, ఎక్కడ బ్లర్ కావాలీ అన్నది మన మీదే అధార పడి ఉంటది. అన్ని తప్పులూ కావాలని చేయకపోయినా, కొన్ని పనులనైనా, కనీసం ముఖ్యమైన వాటినైనా, కావాలనుకొని చేయకపోవటం తప్పు...

కొన్ని పనులనైనా సమయానుకూలంగా చేస్తేనే జీవితానికి సార్థకత..ప్రశాంతత..
(ఇప్పుడు సమయం ఆసన్నమైంది నిద్ర పోవడానికి ;-) )