నాలో వేదనే చెప్పేదెలా

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెలా ప్రాణమా? ప్రేమా..

కన్నుల్లో శూన్యం..గుండెల్లో భారం..
ఎన్నాళ్లీ మౌనం...ఆనందం మాయం..

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెలా ప్రాణమా? ప్రేమా..

మాట రాక మనసూరుకుందే
నమ్మలేని కథలాగె ఉందే

ఒక్కసారి ఒప్పుకోవా...తప్పు చూడలేవా?
పొరపాటు నాదే.... కలిసాను నిన్నే..

నాలో వేదనే చెప్పేదెలా నేస్తమా? చెరిపేదెలా ప్రాణమా? ప్రేమా..
జ్ఞాపకాలే కరిగాయి నేడు
స్నేహబంధం విరిగిందె నీలో

నిన్ను నమ్మి లొంగిపోయా..ప్రేమలోనా మోసపోయా..
పరుగాపనందే..మదిలోని బాధా..